![]() |
![]() |
.webp)
ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని సమ్మర్ హాలిడేస్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఇక పిల్లలందరూ కలిసి ఈ షోకి వచ్చారు. సుధీర్ అడిగిన ప్రశ్నలకు పిల్లలు కొంటెగా జవాబులు కూడా ఇచ్చి నవ్వించారు. ఇక పవిత్ర ఐతే టోటల్ గా జోకర్ గెటప్ లో వచ్చి డాన్సులు చేసి పిల్లలను, పెద్దలను అలరించింది. ఈ షోకి గెస్టులుగా "సారంగపాణి జాతకం" మూవీ టీమ్ నుంచి ప్రియదర్శి, రూప వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ గా ఈ షోని ఎంజాయ్ చేశారు. వాళ్ళతో లెమన్ అండ్ స్పూన్ ఆడించాడు హోస్ట్ సుధీర్. సుధీర్ మరదలి చేస్తున్న స్రవంతి కూడా చిన్నపిల్లలనే నటించింది. "బావా నెమలీకలు పిల్లల్ని పెట్టాయి..ఎం చెయ్యను" అని అడిగింది. "డైపర్లు వేసి స్కూల్ కి పంపించు" అంటూ ఇంకా కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు సుధీర్.
ఇక లిటిల్ సింగర్ వాగ్దేవిని పిలిచి "అమ్మ వాగ్దేవి ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటుంది" అని అడిగేసరికి "వాటికి మనలా సోఫాలు ఉండవు కదా" అని చెప్పేసరికి మిగతా పిల్లలు చప్పట్లు కొట్టి అబ్బా ఎం చెప్పింది అంటూ పొగిడేశారు. ఆ తర్వాత జువేరియాని పిలిచాడు. ఈమె అలీ అన్న కూతురు అంటూ పరిచయం చేసాడు. ఆమె ఒక బుక్ తీసుకొచ్చి సుధీర్ చేతికి ఇచ్చింది. "నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చింది" అంటూ గిఫ్ట్ ఓపెన్ చేసేసారికి షాకయ్యాడు "30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా" అనే బుక్ చూసేసరికి షాకయ్యాడు. ఇదేంటమ్మా అని అడిగేసరికి "ఇంకో బుక్ ఉంది...నెక్స్ట్ ఇయర్ తెస్తాలే...60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలా" అనే బుక్ అని కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రియదర్శితో కూడా పిల్లలతో పాటు లెమన్ అండ్ స్పూన్ ఆడిగాడు సుధీర్. పవిత్ర జోకర్ గెటప్ లో వచ్చేసరికి నెటిజన్స్ కూడా జోకర్ లా నవ్వించడం అంతా ఈజీ కాదు పవిత్ర బాగా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |